Friday, April 27, 2012

క్షిపణి సామర్థ్యమే కాదు దౌత్య క్రుషి కీలకం - ప్రొఫెసర్. కె. నాగేశ్వర్భారతదేశం ఇటీవల అగ్ని -5 ను విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత శక్తివంతమైన, సుదూర లక్ష్యాలను చేదించగల, బాలిస్టిక్  క్షిపణి  అయిన అగ్ని -5 ప్రయోగం తో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో మరో ఉన్నత శిఖరాన్ని ఎక్కినట్లయింది. ఇప్పటివరకు బారత సైన్యం అంబులపొదిలో  అత్యంత శక్తివంతమైన ఆయుదం ఇదే. అందుకే దీన్ని గేమ్ చేంజర్ గా  భారత రక్షణ మంత్రికి శాస్త్ర సలహ దారుడైన వి.కె.సారస్వత్ అభివర్ణించారు. దీని అర్థం ఇప్పటి వరకూ ఉన్న ఆయుధాలు ఒక ఎత్తైయితే ఇదొక ఎత్తు అని. ఒక టన్ను బరువు కల వార్‌హెడ్ తో (ఆయుధం) 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అగ్ని-5 విజయంవంతంగా ఛేదించింది. అయితే, మరిన్ని ప్రయోగాల అనంతరం దీన్ని సైన్యానికి మోహరించేందుకు అందజేస్తారు. దీన్ని వర్గీకరించడంలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఇది భారతదేశం ప్రయోగించిన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి  (ఐ సి బి ఎం ) అని కొందరు నిపుణుల  పేర్కోనగా కాదని మరికొందరి అభిప్రాయం. ఇది కూడా మధ్యంతర రేంజి కల బాలిస్టిక్ క్షిపణియే (ఐ ఆర్ బియం ) అని మరికొందరు నిపుణుల వాదన . ఐసి బి ఎం ల లక్ష్యం 10 వేల కిలోమీర్ల వరకుంటుంది. అగ్ని 5 లక్ష్యం 5000 కిలోమీటర్లు మాత్రమే అని వీరి వాదన . చివరకు, దాదాపు అందరు నిపుణులు ఇది ఐ సి బి ఎం ను పోలిన క్షిపణి అని  మాత్రం అంగీకరిస్తున్నారు. మరలా వివిధ దశల ప్రయోగాలలో దీని లక్ష్య దూరాన్ని పెంచుకోవటానికి కూడా అవకాశం ఉందని నిపుణుల వాదన. వర్గీకరణ ఎలా ఉన్నప్పటికి భారతదేశం ఇప్పటివరకు ఇంత దూరంలో ఉన్న లక్ష్యాలను చేదించగల క్షిపణులను  ప్రయోగించడం ఇదే ప్రథమం. ఐక్య రాజ్య సమితి లోని శాశ్వత సబ్య దేశాలకు మాత్రమే ఇంతటి సామర్థ్యం కల క్షిపణులను ప్రయోగించకల సామర్థ్యం ఇప్పటివరకు ఉంది.

సుదూర లక్ష్యం
క్షిపణుల లక్ష్య దూరం పెరుగుతున్న కొద్ది   దేశాన్ని మరింత శత్రు దుర్బేధ్యంగా ఉంచుకునేందుకు ఇవి దోహదం చేస్తాయి. అందులోను భారతదేశానికి అణుపాఠవం కూడా  ఉంది. ఇప్పటికే రెండు సార్లు భారతదేశం అణు పరీక్షలు జరిపింది. అణ్వాయుధాలు తయారు చేయకల సామర్థ్యం తో పాటు వాటిని తీసుకెళ్ళి ఎంచుకున్న లక్ష్యం పై ప్రయోగించేందుకు సాదనంగా ఉపయోగపడే క్షిపణుల సామర్త్యం కూడా ఇప్పుడు భారతదేశ సంతరించుకుంది. అయితే, వాస్తవానికి ఇప్పటికే భారతదేశం సమీపంలోని లక్ష్యాల విషయంలో ఇలాంటి సామర్థ్యం సాదించింది. ఉదాహరణకు, భారతదేశానికి ఇప్పటికే  మొత్తం పాకిస్తాన్  ను చేరుకోగల అణు క్షిపణుల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ప్రయోగించిన  అగ్ని 5 తో ఇప్పుడిక భారతదేశానికి చైనాను సైతం చేరుకోగల క్షిపణి సామర్థ్యం లభించినట్లయింది. ఆఫ్రికా, మధ్య, తూర్పు యూరప్  మరోవైపు ఆస్ర్టేలియా వరకు చేరుకోగల  సామర్థ్యం కూడా అగ్ని -5  కు ఉంది. దీని అర్థం భారతదేశం ఈ దేశాల పైకి క్షిపణులను ప్రయోగిస్తుందని కాదు. ఇతర దేశాలు మనపై దాడి చేయకుండా నిరోధక సామర్థ్యం  మనకు అభించినట్లుగా వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలకు భారతదేశం ఈ అగ్ని-5 తో క్షిపణి రక్షణ కవచాన్ని ఇవ్వవచ్చని కూడా కోందరు వ్యూహాత్మక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  కాని, ఇది భారతదేశ విదేశాగ, దౌత్య విధానాలకు విరుద్దమైన వాదన సుదూర లక్ష్యాలను చేదించగల క్షిపణులను ప్రయోగించడం ద్వారా భారతదేశం తన స్వంత రక్షణకు అవసరమైన ఆదునిక మిలటరీ పాఠవాన్ని పొంద దలుచుకుంది. కాని ప్రపంచ మిలటరీ పోరులో భాగస్వామి కావడం భారతదేశ విధానం కాదు.
భారతదేశం గతంలో ప్రయోగించిన అగ్ని-1 మరియు అగ్ని-2 ల వ్యాసం  కేవలం ఒక మీటర్ మాత్రమే . కాని అగ్ని-3 లాగా అగ్ని-5  కూడా రెండు మీటర్ల వ్యాసం కలది. అందుకే అనేక వార్‌హెడ్స్ లను ఏక కాలంలో మోసుకెళ్ళకల సామర్థ్యం సైతం తొలి క్షిపణులైన అగ్ని -3 మరియు అగ్ని -5 ల స్వంతం. అందుకే వీటిని ఎం ఐ ఆర్ వి లుగా పిలుస్తారు. (Multiple Independently Targeted Re-entry Vehicles MIRV) అయితే, ఇలాంటి ఎం ఐ ఆర్ వి లలో అనేకే సాంకేతిక సవాళ్ళు కూడా పొంచి ఉన్నాయి. అణ  వార్‌హెడ్స్ ను  ఈ క్షిపణి ద్వారా ప్రయోగించేందుకు వాటి సైజును, బరువును గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అని రక్షణ శాస్ర్త , సాంకేతిక నిపుణులు పేర్కొటున్నారు.
ఇక్కడ భారతదేశం ప్రస్తుతం సాదించిన సామర్థ్యాన్ని చైనాతో పోల్చినప్పుడు  ఒక ప్రత్యేకత కూడా ఉంది. చైనా బాలిస్టిక్ క్షిపణుల తయారీలో భారతదేశం కన్నా ముంద విజయవంతమైన క్రుషిని ప్రారంభించింది. కానీ, చైనా కున్న సుదూర లక్ష్యాలను చేదించగల బాలిస్టిక్ క్షిపణులు ఒకే వార్‌హెడ్‌ను తీసుకెళ్ళకల సామర్థ్యం మాత్రమే ఉన్నవి. వీటికి ఎం ఐ ఆర్ వి లకున్న సామర్థ్యం లేదు. భారతదేశం అగ్ని-5 విజయవంత ప్రయోగంతో ఈ సామర్థ్యాన్ని సాదించింది.
దౌత్యమే కీలకం
భారత దేశానికి మాత్రమే క్షిపణుల సామర్థ్యం లేదు.  భారతదేశ సమీపంలో చైనా, పాకిస్తాన్‌లు సైతం ఇప్పటికే బలమైన మిలటరీ పాటవాన్ని పొంది వున్నాయి. పైగా ఈ రెండు దేశాలకూ అణు క్షిపణులు ప్రయోగించ కల సామర్థ్యం కూడా ఉంది. అంతేగాక  ఈ క్షిపణుల సామర్థ్యాన్ని మరింత ఆదునీకరించే పనిలో పడ్డాయి. ఉదాహరణకు, చైనా  తన యూన్నన్, ,క్విన్ ఘాయ్ రాష్ర్టాలలో ఉన్నమిలటరీ స్థావరాలలో ఉన్న క్షిపణులలో ద్రవ ఇందనం స్థానే మరింత ఆదునికమైన ఘన ఇందనాన్న నింపే కార్యక్రామం ద్వారా వాటి సామర్ద్యాన్ని ద్విగుణీక్రుతం చేసే పని మొదలెట్టింది.  ఈ క్షిపణులు భారతదేశం మొత్తాన్ని చేరుకోగల సామర్థ్యం కలవి. దీనికితోడు 2004 లోనే చైనా రెండవతరం అణు జలంతర్ఘాములలో మొదటిదైన 094 అణు జలంతర్ఘామిని ప్రయోగించింది. ఈ అణు జలంతర్గామి  జె ఎల్  -2 ఘన  ఇందన  బాలిస్టిక్ క్షిపణిని మోసుకెళ్ళగలదు. భారతదేశం  ఇటీవల ప్రయోగించిన అగ్ని-5 ఘన ఇందనంతో నడిచే క్షిపణి.
పాకిస్తాన్‌కు కూడా అనేక సుదూర లక్ష్యాలను చేరుకోగల క్షిపణులున్నాయి.  ఉదాహరణకు, ఘన ఇందనంతో నడిచే ఆదునిక షాహిన్  -1 మరియు షాహీన్ -2 క్షిపణులు  పాకిస్తానుకు ఉన్నాయి. ఇవి ఆ దేశానికి విశ్వసనీయ నిరోధక సామర్థ్యాన్ని ఇస్తున్నాయి అని భారతదేశానికి చెందిన వ్యూహాత్మక వ్యవహారాల అధ్యయన బ్రుందం ఇటీవల జరిపిన అధ్యయన నివేదికలో పేర్కొంది.
అందుకే, అణు క్షిపణులు పొందడం మన దేశానికి నిరోధక సామర్థ్యాన్ని ఇస్తుంది. కాని, ఇది మాత్రమే సరిపోదు. ముఖ్యంగా భారతదేశ  సమీప ప్రాంతంలోని బలమైన దేశాలకు క్షిపణులున్న నేపథ్యంలో ఈ దేశాల మధ్య అవగాహన కూడా ఉండడం కీలకం ఏ మాత్రం అపోహలు, అనుమానాలు పెరిగినా కూడా అది బహిరంగ ఘర్షణకు దారితేసే ప్రమాదం ఉంటుంది. అణు క్షిపణులున్న దేశాల మధ్య ఘర్షణ అంటే తీవ్ర వినాశకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే క్షిపణుల సామర్థ్యం సాదించడమే కాదు ఘర్షణలు లేని వాతావరణాన్ని ఏర్పరుచుకోవడం కూడా దేశ రక్షణకు కీలకం అందుకే దౌత్యపరమైన క్రుషిని కూడా ముమ్మరం చేయాలి.  ప్రచ్చన్న యుద్ద  కాలంలో అమెరికా, ఆనాడున్న సోవియట్ యూనియన్ బలా బలాలలో సమతుల్యత సాదించడం కుడా మరో ప్రపంచ యుద్దం రాకుండా నివారణ చర్యలలో భాగంగా అణ్వస్ర్త నియంత్రణ అంశాలపై నిరంతరం చర్ఛలు జరిపాయి. ధీనిని నించి భారతదేశం , చైనాలు, పాకిస్తాన్‌లు విలువైన గుణ పాఠాలు నేర్చుకోవాలి. అణు, క్షిపణి అంశాలలో పారదర్శికంగా, ముందస్థు చొరవతో సంప్రదింపులు జరపాలి.
భారతదేశం చైనాల మధ్య ఉన్న అనుమానాలు వ్యుహాత్మక వైరంగా అభివ్రుద్ధి కాకుండా చూడాల్సిన బాద్యత రెండు దేశాలపైనా ఉంది. వాస్తవానికి భారతదేశ అణు పాఠవం కాని, మిలటరీ పాఠవం కాని, ప్రత్యేకంగా ఏ దేశాన్నీ ఉద్దేశించింది కాదు.  ఈ విషయాన్ని భారతదేశం అనేక సందర్భాలలో స్పష్టం చేసింది.  అదే విధంగా చైనా సాదించిన, సాదించుకుంటున్న సైనిక సామర్థ్యం కూడా భారతదేశంను ద్రుష్టిలో ఉంచుకొని చేసింది కాదని భారతదేశానికి చెందిన వ్యూహాత్మక నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. అమెరికాతో పోటీగా ప్రపంచంలో బలీయమైన ఆర్థిక, రాజకీయ, మిలటరీ శక్తిగా చైనా అవిర్భవించదలుచుకుంది.  ఈ నేపథ్యంలో చూసినప్పుడు సంప్రదింపుల ద్వారా తమ మద్య అనుమానాలు పెరగకుండా ఇరు దేశాలు క్రుషి చేయాలి. ఇప్పటికే సరిహద్దు విషయంలో సమస్యలు, సంబందాలలో సున్నితమైన అంశాలున్న నేపథ్యంలో బాద్యతాయుతమైన సైనిక శక్తిగా ఇరుదేశాలు వ్యవహరించడం ద్వారా ఈ రెండు దేశాలకు శాంతి ,సుస్థిరత, లభించడమే కాదు ఈ మొత్తం ప్రాంత భద్రతకు, సుస్థిరతకు కూడా కీలకం అవుతుంది.
ఇక పాకిస్తాన్ సైనిక పాఠవం కల దేశమే మాత్రమే కాదు బాద్యతా రహితమైన దేశం కూడా పాకిస్తాన్ మిలటరీ వ్యూహం మనదేశాన్ని ఉద్దేశించిందే. భారతదేశం అణు పరీక్షలు జరపడంతో పాకిస్తాను కూడా అణు పరీక్షలు జరిపింది దీనితో అప్పటివరకు మన దేశానికి సాంప్రదాయ యుద్ద క్షేత్రంలో ఉన్న ఆదిక్యత కాస్తా పోయిందని అమర్థ్యసేన్ లాంటి వారు కూడా వ్యాఖ్యానించారు. అందుకే ఆయుదాలు మాత్రమే రక్షణ కల్పించవు. ఆయుధ సంపత్తిని ఇతర దేశాలు కూడా పొందే అవకాశం ఉంటంది. అందుకే అగ్ని-5 ప్రయోగం సందర్భంగా వ్యక్తమయిన స్పందనలో కొంత సంయమనం కూడా అవసరం. అందుకే పాకిస్తాన్ తో కూడా దౌత్య సంబందాలు మరింత ముమ్మరం చేయడం ద్వారా ఈ దక్షిణాసియా ప్రాంతంలో అనవసర క్షిపణి పోరు పెరగకుండా భారతదేశం క్రుషి చేయాలి.
భారతదేశం  జరిపిన అగ్ని ప్రయోగం ఉత్తర కొరియా జరిపిన వివాదాస్పద ప్రయోగం  జరిగిన సమయంలోనే ఉండడం కూడా గమనార్హం. ఉత్తర కొరియా జరుపుతున్న ప్రయోగాలను అమెరికా, దాని మిత్ర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ దేశం పై ఆంక్షలను కూడా విధించాయి. అయితే భారతదేశం జరిపిన క్షిపణి ప్రయోగం పట్ల అమెరికా,   పశ్చిమ దేశాల స్పందనకు ప్రాధాన్యత వచ్చింది. కొన్ని దేశాలు జరిపే వ్యైహాత్మక క్షిపణి ప్రయోగాలు మరికొన్ని దేశాలు జరిపే వాటికన్న ఎకువ ఆమోదయోగ్యం అని అమెరికా, నాటో  కూటమి, ఆస్ర్టేలియా లాంటి దేశాలు వ్యాఖ్యానించాయి. ఇందుకు మరో కారణం కూడా భారతదేశం అణు ప్రయోగాలు, క్షిఫణి ప్రయగాలు ఏనడు  యోద్దోన్నమాదం తో జరిపినవి కావు. ఇది తెలిసే అమెరికా దాని మిత్ర దేశాలు భారతదేశం జరిపిన అగ్ని -5 ప్రయోగం పట్ల  సానుకూలంగా  స్పందించిందని మాత్రమే చెప్పలేం. భారతదేశం అంతకు  ముందు అణు పరీక్షలు జరిపిన్పుడు, అమెరికా మనదేం పై ఆంక్షలు విధించింది. మన దేశ అగ్ని  క్షపణి  కార్యక్రమం పై కూడా ఆంక్షలను అమెరికా విధించింది. చివరకు రోదసీ కార్యక్రమం పై కూడా క్షిపణి సాంకేతిక నియంత్ర ప్పందం కింద అమెరికా మన దేశంపై ఆంక్షుల విధించిందొ. వాస్తవానికి ఈ ఒప్పందంలో భారతదేశం భాగస్వామి కూడా కాదు. అయితే, ఇప్పుడు అమెరికా, పశ్చి మ దేశాలు సానుకూలంగా ఉండడానికి కారణం కూడా ఉంది. భారతదేశం ఇటీవల కాలంలో అమెరికాతో మిలటరీ వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకుంది.  పెరుగుతున్న భారతదేశ సైనిక శక్తి చైనాకు చెక్ చెప్పినట్లు ఉంటుందని పశ్చిమ దేశాలు బావించడం కూడా ఒక కారణం. అందుకే భారతదేశ అగ్ర రాజ్యాల వ్యూహాత్మక బందంలో చిక్కుకోకుండా  తన దేశ అవసరాల కనుగుణంగా సైనిక పాఠవాన్ని పెంచుకోవడంతో పాటు ఇది ఆయుధ పోరుకు, ఉద్రిక్తతలకు కారణం కాకుండా దౌత్యపరమైన క్రుషిని ముమ్మరం చేయాల.
భారతదేశనికే చెందిన రక్షణ పరిశోధన అభివ్రుద్ధి సంస్థ (డి ఆర్ డి  ఒ) అగ్ని-5 ను రూపొందించింది. దీన్ని దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ప్రయోగించగలం. భారతదేశం రూపొందించిన అగ్ని-1  కేవలం 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే చేదించగలది అగ్ని-2  రేంజి 2000 కిలోమీటర్లు, అగ్ని-3 రేంజి 3500 కిలోమీటర్లు. అగ్ని-4  రేంజి 3000 కిలోమీటర్లు ఇప్పుడు ప్రయోగించిన అగ్ని-5 రేంజి 5000 కిలోమీటర్లు.  ఈ క్షిపణులు ఘన ఇందనం వాడడం వల్ల తొందరగా ప్రయోగించేందుకు వీలు కలుగుతుంది. మొబైల్ లాంచర్ల పై నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. ఫలితంగా వీటిని శత్రు దేశాలు గుర్తించి దాడి చేయడం కష్టం. పెరిగిన సైనిక సామర్థ్యంతో బాద్యత కూడా పెరుగుతుంది. అణు రంగంలో ఏవిధమైన అత్యాధునిక సాకేతిక పాఠావాన్ని సంపాదించుకుని బాద్యతగా వ్యవహరించామో అదే విధమైన బాద్యతను క్షిపణి రంగంలో కూడా భారతదేశం చూపనుంది. అందుకే క్షిపణి సామర్థ్యమే కాదు దౌత్య క్రుషి కీలకం.

No comments:

Post a Comment