Friday, April 27, 2012

క్షిపణి సామర్థ్యమే కాదు దౌత్య క్రుషి కీలకం - ప్రొఫెసర్. కె. నాగేశ్వర్



భారతదేశం ఇటీవల అగ్ని -5 ను విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత శక్తివంతమైన, సుదూర లక్ష్యాలను చేదించగల, బాలిస్టిక్  క్షిపణి  అయిన అగ్ని -5 ప్రయోగం తో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో మరో ఉన్నత శిఖరాన్ని ఎక్కినట్లయింది. ఇప్పటివరకు బారత సైన్యం అంబులపొదిలో  అత్యంత శక్తివంతమైన ఆయుదం ఇదే. అందుకే దీన్ని గేమ్ చేంజర్ గా  భారత రక్షణ మంత్రికి శాస్త్ర సలహ దారుడైన వి.కె.సారస్వత్ అభివర్ణించారు. దీని అర్థం ఇప్పటి వరకూ ఉన్న ఆయుధాలు ఒక ఎత్తైయితే ఇదొక ఎత్తు అని. ఒక టన్ను బరువు కల వార్హెడ్ తో (ఆయుధం) 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అగ్ని-5 విజయంవంతంగా ఛేదించింది. అయితే, మరిన్ని ప్రయోగాల అనంతరం దీన్ని సైన్యానికి మోహరించేందుకు అందజేస్తారు. దీన్ని వర్గీకరించడంలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఇది భారతదేశం ప్రయోగించిన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి  (ఐ సి బి ఎం ) అని కొందరు నిపుణుల  పేర్కోనగా కాదని మరికొందరి అభిప్రాయం. ఇది కూడా మధ్యంతర రేంజి కల బాలిస్టిక్ క్షిపణియే (ఐ ఆర్ బియం ) అని మరికొందరు నిపుణుల వాదన . ఐసి బి ఎం ల లక్ష్యం 10 వేల కిలోమీర్ల వరకుంటుంది. అగ్ని 5 లక్ష్యం 5000 కిలోమీటర్లు మాత్రమే అని వీరి వాదన . చివరకు, దాదాపు అందరు నిపుణులు ఇది ఐ సి బి ఎం ను పోలిన క్షిపణి అని  మాత్రం అంగీకరిస్తున్నారు. మరలా వివిధ దశల ప్రయోగాలలో దీని లక్ష్య దూరాన్ని పెంచుకోవటానికి కూడా అవకాశం ఉందని నిపుణుల వాదన. వర్గీకరణ ఎలా ఉన్నప్పటికి భారతదేశం ఇప్పటివరకు ఇంత దూరంలో ఉన్న లక్ష్యాలను చేదించగల క్షిపణులను  ప్రయోగించడం ఇదే ప్రథమం. ఐక్య రాజ్య సమితి లోని శాశ్వత సబ్య దేశాలకు మాత్రమే ఇంతటి సామర్థ్యం కల క్షిపణులను ప్రయోగించకల సామర్థ్యం ఇప్పటివరకు ఉంది.

Wednesday, April 18, 2012

భారతదేశంలో కనీస వసతులు- ప్రొఫెసర్.కె.నాగేశ్వర్


భారత ప్రజల సామాజిక, ఆర్థిక  స్థితిగతుల గురించి విలువైన సమాచారాన్ని జనాభ లెక్కలు మనకు అందిస్తాయి. ఆర్థిక అభివ్రుద్ధి ప్రణాళికల రచనకు ఈ జనగణన సమాచారం కరదీపికగా ఉపకరిస్తుంది. ఇటీవల జనగణన సంస్థ 2011 జనాభ లెక్కలకు సంబంధించిన హౌజింగ్ అండ్ హౌజ్లిస్టింగ్ సెన్సస్ సమాచారాన్ని ప్రకటించింది. భారతదేశాలలోని దుర్భర గ్రుహ సదుపాయాల స్థితిని ఈ వివరాలు బయటపెడ్తున్నాయి. దేశంలోని అధిక సంఖ్యాక కుటుంబాలు కేవలం ఒకే  గదిలో జీవిస్తున్నాయి. భారతీయ సమాజంలోని తీవ్ర అసమానతలను ఈ వివరాలు తెలియజేస్తున్నాయి. జన గణన శాఖ జరిపిన ఈ సర్వే దేశంలోని గ్రుహ సముదాయాలలో ఉన్న కనీస వసతుల, షఆస్తుల వివరాలను తెలుపుతున్నాయి. విద్యచ్చక్తి, పారిశుదద్ సేవల అందుబాటు, డ్రైనేజీ సదుపాయం, త్రాగునీటి అందుబాటు , ఇతర అవసరాలకు నీటి అందుబాటు, మొదలగు విషయాలలో మనదేశం ఇంకా ఎంత  వెనుకబడి ఉందో అర్థమవుతుంది.