Wednesday, April 18, 2012

భారతదేశంలో కనీస వసతులు- ప్రొఫెసర్.కె.నాగేశ్వర్


భారత ప్రజల సామాజిక, ఆర్థిక  స్థితిగతుల గురించి విలువైన సమాచారాన్ని జనాభ లెక్కలు మనకు అందిస్తాయి. ఆర్థిక అభివ్రుద్ధి ప్రణాళికల రచనకు ఈ జనగణన సమాచారం కరదీపికగా ఉపకరిస్తుంది. ఇటీవల జనగణన సంస్థ 2011 జనాభ లెక్కలకు సంబంధించిన హౌజింగ్ అండ్ హౌజ్లిస్టింగ్ సెన్సస్ సమాచారాన్ని ప్రకటించింది. భారతదేశాలలోని దుర్భర గ్రుహ సదుపాయాల స్థితిని ఈ వివరాలు బయటపెడ్తున్నాయి. దేశంలోని అధిక సంఖ్యాక కుటుంబాలు కేవలం ఒకే  గదిలో జీవిస్తున్నాయి. భారతీయ సమాజంలోని తీవ్ర అసమానతలను ఈ వివరాలు తెలియజేస్తున్నాయి. జన గణన శాఖ జరిపిన ఈ సర్వే దేశంలోని గ్రుహ సముదాయాలలో ఉన్న కనీస వసతుల, షఆస్తుల వివరాలను తెలుపుతున్నాయి. విద్యచ్చక్తి, పారిశుదద్ సేవల అందుబాటు, డ్రైనేజీ సదుపాయం, త్రాగునీటి అందుబాటు , ఇతర అవసరాలకు నీటి అందుబాటు, మొదలగు విషయాలలో మనదేశం ఇంకా ఎంత  వెనుకబడి ఉందో అర్థమవుతుంది.

భారతదేశం మొత్తం మీద చూస్తే ఆరు లక్షల గ్రామాలున్నాయి. దేశంలో 7933 పట్టణాలు, ఉన్నాయి. 4635 జాతులకు చెందిన ప్రజలున్నారు.  వీరిలో 80000 విభిన్న ఉపజాతులు, శాఖలు ఉన్నాయి. భఆరతదేశంలో మొతత్ 18 భాషలుండగా 6661 మాత్రు భాషలున్నాయి. 2875  రకాల మతాలు , ఇతర విశ్వాసాలు  కలవారున్నారు. 
 దేశంలో ప్పటికి అధిక సంఖ్యాకులైన ప్రజలు కేవలం ఒకే గది కల నివాసం జీవించడమే కాకుండా ఆ గదిలోకూడా మటట్తో ఉన్న ఫ్లోరింగ్ యే ఉంది. రవాణకు సైకిళ్ళనే వినియోగిస్తున్నారు. వంట కలప నే ఇందనంగా వినియోగిస్తున్నారు.  దేశంలోని ఇళ్ళలో 31 శాతం  లో ప్రత్యేక వంటగది లేదు. ఇప్పటికి సురక్షిత డ్రైనేజీ  సదుపాయంలేదు. బహిరంగ స్థాలాలలోనే కాలక్రుత్యాలను తీర్చుకుంటున్నారు. దాదాపు సగం ఇళ్ళలో ప్పటికి నీటి వసతి లేదు. అయితే అంతకు ముందు 2001 లో జరిగిన జనాభ లెక్కల తో పోలిస్తే వివిధ కొలబదద్లలో పరిమాణాత్మకంగా, చూసినా , నాణ్యత రీత్యా చూసినా ప్రగతి ఉంది. కాని, ఈ ప్రగతి చాలీ చాలనిదే. పరిస్థితి ఇంకా దుర్భరంగా నే ఉంది.

ఒకటి, రెండు గదులలోనే అధిక జనాభా
 ఇక వివరాలలోకి వెళితే పరిస్థితి ఇంకా ఎంత ఆందోళన కరంగా ఉందో అర్థం చేసుకోవయచ్చు. ఉదాహరణకు, దేశంలో  ఉన్న మ త్తం గ్రుహాలలో 37.1 శాతం కేవలం కే గదితోనే ఉన్నాయి. . ఇందవులో  గ్రామీణ ప్రాంతాలలో ఉన్న గ్రుహాలలో 39.4 శాతం, పటట్ణ ప్రాంత గ్రుహాలలో 32.1 శాతం లో కవలం ఒకే గది మాత్రమ  ఉంది. మహా నగరాలలోని ఆకాశ హర్మ్యాలను చూసి దేశం అద్బుతంగా అభివ్రుదద్ చెందిందనకుంటే పొరపాటని సాక్షాత్తు భారత ప్రభుత్వ  నిరవ్హించే జనాభ లెక్కలే తెలుపుతున్నామయి. సగటున దేశం బమొతత్ మీద చూస్తే  కేవలం 2.8 శాతం ఇళ్ళలో మాత్రమే ఆరులేదా అంతకన్న ఎక్కువ గదులు ఉన్నాయి (  గ్రామీణ ప్రాంతాలలో 2.5 వాతం, పట్టణ ప్రాంతాలలో 3.3 శాతం ).  ఇక దేశం మొతత్ మీద చూస్తేకేవలం 31.7 శాతం ఇళ్ళలో మాత్రమే రెండు గదులున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాలలోనయితే 32.2 శాతం, పటట్ణ ప్రాంతాలలోనయితే 30.6 శాతం ఇళ్ళలో రెండు గదులున్నాయి.  అంటే దేశం మొతత్ మీద మెజారిటీ ప్రజలు ఒకటి లేదా రెండు గదుల ఇళ్ళలోనే  జీవిస్తున్నారు.  అందుకే సామాజిక గ్రుహ వసతికై ప్రభుత్వాలు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అంత ప్రజాదరణ పొందుతున్నాయి. గ్రుహ వసతి ప్రజలకు సామాజిక భద్రతను, సాంస్క్రుతిక అస్థిత్వాన్ని స్తుందని అనేక సామజిక శాస్ర్త అద్యయనాలు తెలుపుతున్నాయి.
మంచి నీరు బంగారమే
ప్రజారోగ్యం లో త్రాగు నీరు అందుబాటు కీలకాంశం . సురక్షిత  మంచినీటి అందుబాటు లేనందున అనారోగ్య భారం పెరుగుతోంది. అనకే సంర్భాలలో ప్రాణ నష్టానికి కూడా కారణమవుతోంది.  కులాయిల ద్వార సురక్షొత మంచి నీరు అందుబాటులో ఉన్నది కేవలం 32 శాతం గ్రహాలలోనే. ఇక తమ ఇంట్లోనే నీటి వసతి ఉన్న గ్రుహాలు 47 శాతం మాత్రమే.  సగంకన్నా ఎక్కువ ఇళ్ళలో స్నానానికి సదుపాయం లేదు. కేవలం 42 శాతం ఇళ్ళలోనే ఇలాంటి సదుపాయం ఉంది.   గ్రామీణ ప్రాంతాలలో ప్పటికి సుమారు 75 శాతం ఇళ్ళలో స్నానానికి  గది లేదు. . ఇక పటట్ణ ప్రాంతాలలో కూడా ప్పటికి సుమారు  , 23 శాతం ఇళ్ళలో  స్నానానికి సదుపాయం లేదు.  చివరకు, మహహిళలు, పిల్లలు కూడా బహిరంగ స్థలంలోనే లేదా ఇతరులతో కలిసి ఉన్న సాదుపాయంలోనే స్నానం చేయాల్సిన దుస్తితి ఉంది. ఇక కేవలం 51 శాతం ఇళ్ళకు మాత్రమే ఏదో రకమైన డ్రైనేజీ సదుపాయం ఉంది.
మరుగుదొడడ్ కనన్నా మొబైల్ ఫోన్ యే మక్కువ
దేశంలోని 50 శాతం కన్నా అదిక (53.1శాతం) గ్రుహాలలో మరుగుదొడ్డు సదుపాయం లేదు. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరీ అద్వాన్నం గ్రామీణ భారతదేశంలో 69.3 శాతం ఇ ఇళ్ళలో మరుగుదొడ్డు సదుపాయం లేదు. మరుగుదొడ్డి సదుపాయం ఏర్పాటు చేసుకోవడం కనాన మొబైల్ ఫోన్  ను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో సగం కన్నా ఎక్కువ  మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారు. మరుగు దొడడ్ కన్నా మొబైల్ ఫోన్ ముఖ్యమనుకుంటున్నారా లేదా మొబైల్ ఫోన్  చౌకగా ఉండడమో తెలియదు కాని  భారతదేశంలో మారుతున్న జీవన శైలిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంట్లో  పారిశుద్ద సదుపాయంకన్నా కూడా టెలివిజన్ ఉండడం పైనే గ్రామీణ భారతీయులుఅదిక సంఖ్యాకులు ష్ట పడ్తున్నారు. ఇందుకు జనాభ లెక్కలు అందిస్తున్న గణాంకాలే సాక్ష్యం .గ్రామీ న భారతదేశంలో కేవలం 30.7 శాతం ఇళ్ళలో   మరుగుదొడ్డి సదుపాయం ఉంది. కానీ, గ్రామీణ  భారతదేశంలోని 34 శాతం ఇళ్ళలో టెలివిజన్ ది. గ్రామీణ భారతీయులు ప్పటికి ఇంట్లో మరుగుదొడడ్  ఉండకూడదు అన్న ప్రాచీన నమ్మకాన్ని కలిగి ఉన్నారని సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాథక్  వ్యాఖ్యానించారు.  గ్రామీణ భారతదేశంలో మరుగుదొడ్డి సదుపాయం టిలివిజన్, మొబైల్ ఫోన్  కన్నా తక్కువ ఇళ్ళలో ఉండటానిక ఈ విశ్వసం కూడా కారణం అని  సామాజిక శాస్ర్త వేతత్లు విశ్లేషిస్తున్నారు. సరైన అవగాహన , సలహా  లేకపోవడం కూడా ఈ పరిస్థితికి  కారణమని యునిసెఫ్ నిపుణులు పేర్కొన్నారు.  సగం కన్నా ఎక్కువ మ ది భారతీయులు ప్పటికి బహిరంగ స్థలాలోనే కాలక్రుత్యాలు తీర్చుకుంటున్నారని  యునిసెఫ్ , ప్రపపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త అధ్యయనం కూడా తెలుపుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తుతతం విడుదలైన జనాభ లెక్కల వివరాలు తెలియజేసస్తున్నాయి. అయితే , ఈ సమస్య కేవలం  గ్రుహ సముదాయాలలో సదుపాయాలకు సంబందించినదే కాదు  ఇదొక ప్రజారోగ్య సమస్య  కూడా అని నిపుణులు పేరన్కొటున్నారు. ఉదాహరణకు, దేశంలో నమోదవుతున్న అతి సారా  వ్యాధి కి సంబందించిన కేసులలో 80 శాతం కన్నా ఎక్కువ వాటికి  కారణం  త్రగునీటిలో నాణ్యత లేకపోవడం, సరైన పారిశుదద్ సదుపాయం లేకపోవడం , శుచి , శుభ్రత  ఉండకపోవడమే.  అని యునిసెఫ్ విశ్లేషణ. పారిశుదద్ సదుపాయాలు లేకపోవటాని ఇంటిక సంబందించిన నిర్ణయాలలో మహిళలకు  పెద్దగా భాగస్వామ్యం లేకపోవడం కూడా ముఖ్య కారణమని ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలు వాదిస్తున్నాయి.
ఆదునిక భారతదేశానిక తలవంపు కలిగించే వాస్తవాలను కూడా జనాభ లెక్కలు బయట పెట్టాయి. ఇప్పటికి , దేశంలో మానవ వ్యర్థ పదార్థాలను మనుష్యులే తొలగించి రవాణా చేసే దుర్మార్గ పదదితి కొనసాగుతోంది. దేశంలోని 8 లక్షల గ్రుహాలలో ఈ పరిస్థితి ఉందని జనాభ లెక్కలు 2011 తెలుపుతున్నాయి. తొలి భారత  రాష్ట్రపతి  రాజేంద్ర ప్రసాద్  నాటి నించ ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వరకు ఈ నిక్రుష్ట పరిస్థితి నించ విముక్తి కల్పిస్తామని ప్రకటిస్తూ వచ్చారు. జూన్, 2011 లో ప్రధాని మన్మోహన్ సింగ్  ఆరు నెలలో ఈ పరిస్థితిని లేకుండా చేస్తామని హామీ కూడా ఇచప్చారు. కాని, జనాభ లెక్లే నాగరికతకు తలవంపు కలిగించే పరిస్థితులు ఉన్నాయిన తెలుపడం ఆందోళన కలిగించే అంశం.
మానవాభివ్రుదద్కి కనీస కొలబదద్లైన మంచి నీరు, పారిశుద్ధ సేవల అందుబాటులోనే పరిస్థితి దయనీయంగా ఉంటే క మానవాభివ్రుద్దికి సంబందించిన ఇతర కొలబదద్లలో పరిస్థితిని గురించి వేరే చెప్పనవసరం లేదు. . విద్యత్ వినియోగం , ఇందన వాడకం , మ దలగు వాటిని కూడా సామాజిక, అబివ్రుద్ది లేదా మానవాభివ్రుద్ధికి ప్రాతిపదికగా బావిస్తారు. ఈ విషయంలో దేశంలోని కొదద్ శాతం ప్రజలు మాత్రమే  సదుపాయాలు కలిగి ఉన్నారు. క కంప్యూటర్, ఇంటర్నెట్ లాంటి ఆదునిక సదుపాయాల గురించి ప్త్యేకంగా చెప్పనవసరం లేదు.
దేశం మొతత్ మీద చూస్తే 67 శాతం మంది ప్రజలు ప్పటికి వంటకోసం వంట చురుకు, లేదా పంటల వ్యర్థ పదార్థాలు, లేదా పిడకలు, లేదా బొగ్గునే వాడుతున్నారు.   అంటే సురక్షిత మైన ఇందన సదుపాయం ఇళ్ళలో లేని వారు అత్యధికులు దేశంలో ఉండడం మనం సాదించిన ఆదునిక అభివ్రుద్దిని ప్రశ్నిస్తోంది. ఈ పరిస్థితి మహిళల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్న చూపుతోందిన వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి. క దేశం లోని 29 
శాతం  గ్రుహాలలో ఎల్ పి జి , విద్యుచ్చక్తి లేదా బయోగ్యాస్ తో వంట చేస్తున్నారు. అయితే , 2001 జనాభ లెక్కలతో పోలిస్తే 2011 లో  వంటగ్యాస్  వాడే గ్రుహాల సంఖ్య 11 శాతం పెరిగింది.

మూడవ వంతు ప్రజలు కిరోసిన్ దీపాల వెలుగులోనే
 మానవాభివ్రుద్ధికి మాత్రమే కాదు ఆదునిక ఆర్థికాభివ్రుదద్కి విద్యత్ వినియోగం కొలబదద్ గా పరిగణిస్తారు. ఈ విషయంలో కూడా అభివ్రుద్ధి రాబమిత్యం ఇంకా ఎక్కువే.  .  దేశం మొతత్ మీద చూస్తే విద్యచ్చక్తి ని ఉన్న గ్రహాలు 67.2 శాతం. అంటే ఇంకా దేశంలో మూడవ వంతు గ్రుహాలకు విద్యచ్చక్తి అందుబాటులో లేదంటే అభివ్రుద్ధిలో ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో నయితే కేవలం 55.3 శాతం గ్రుహాలకు  మాత్రమే విద్యచ్చక్తి అందుబాటులో ఉంది. గ్రామీణ విద్యద్దీకరణ ప్రణాళికలు ఇ:తవరకు అమలు చేస్తున్న తర్వాత కూడా ఇది పరిస్థితి. అయితే విద్యచ్చక్తి ఉన్న గ్రుహాల సంఖ్య 2001 తో పోలిస్తే 2011 లో 11 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితి ఉంటేనే విద్యత్తు అందుబాటుకు, అవసారానికి మధ్య   గణనీయమైన తేడా ఉంది. క దేశంలోని ప్రజలందరికి విద్యుచ్చక్తిని అందుబాటులోకి తేవాలంటే విద్యుత్ ఉత్పత్తి ఎంత పెరగాలో అర్థం చేసుకోవచ్చు.
దేశం లో ఇప్పటికి 31 శాతం గ్రుహాలు కిరోసిన్ దీపాల వెలుగులోనే జీవనాన్ని సాగిస్తున్నారంటే  ఆ:దోళన కలుగకమానదు. సమాచార సాంకేతి క రంగం నించి అణు విజాణణం  వరకు దేశం ఎంతగానో అభివ్రుద్ధి సాదించిన తర్వాత కూడా 30 శాతంకు పైగా  ఇళ్ళలో కిరోసిన్ దీపాకలే దిక్కంటే ఏం  సమాధానం చెప్పగలం.
పది శాతం లోపు ఇళ్ళలోనే కంప్యూటర్లు
భారతదేశం సమాచార సాంకేతిక రంగంలో దూసుకుపోతోంది. సాఫ్టవేర్ రంగంలో అమెరికానే  ఆశ్చర్య పరుస్తోంది. ఇందంతా నాణానికి ఒకవైపు  మాత్రమే. భారతదేశం మొత్తం మీద చూస్తే కేవలం 9.5 శాతం ఇళ్ళలోనే కంప్యూటర్ ది. కేవలం మూడు శాతం ఇళ్ళలో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది.  ఇక కంప్యూటర్లు, ఇంటర్నెట్ దేశంలో అధిక సంఖ్యాక గ్రుహాలకు అందుబాటు లోకి వస్తే సమాచార సాంకేతిక రంగంలో మనదేశం ఎంత అభివ్రుద్ది చెందటానికి అవకాశం ఉందో ఊహించవచ్చు.
ఈ గణాంకాలు దేశం మొత్తం మీద ఎఉన్న పరిస్థితి గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో ఉన్న గ్రుహాలలో ఉన్న సదుపాయాలు, ఆస్తుల గురించని సమాచారం. గ్రామీణ , పటట్ణ ప్రాంతాల మధ్య ఈ కనీస సదుపాయాల అందుబాటులో ఎంతో తేగా కనిపిస్తోంది. క మనదేశంలో వివిధ ప్రాంతాల మధ్య, సామాజిక తరగతుల మధ్ తీవ్ర అంతరాలున్నాయి. షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలు ఇలా సమాచారానిన తులనాత్మకంగా విశ్లేషించి చూస్త పరిస్థితి మరింత అద్వాన్నంగా కనిపిస్తుంది. సుమారు  మూడవ వంతకు గ్రామీణ ప్రజలు  రోజు కనీసం 22 రూపాయలు కూడా ఖర్చు చేయలేని దయనీయ స్థితి లో ఉంటే షెడ్యూల్డు కులాలు , తెగలలో ఇది దాదాపు సగం  మంది ఈరకమైన ఆర్థిక స్థితిలో ఉన్నారు. సదుపాయాలు, ఆస్తుల విషయంలో కూడా ఇదే రకమైన తీవ్ర అంతరాలు ఉన్నాయి. భారతదేశం ఏటా 8 శాతం వ్రుధ్ధి సాదిస్తున్న కాలంలో నే కనీస వసతులు లేని ప్రజలు ఇంత టి స్థాయిలో ఉన్నారు. భారతదేశం ప్రపపంచంలోనే శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్న దేశం. ప్రపపంచంలోనే నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్త కానీ, సామాజిక అభివ్రుద్ధి ,మానవాభివ్రుద్ధి విషయంలో ప్రజలకు నాణ్యమైన జీవితాలనివ్వడం చాలా వెనుకబడి ఉందని మరోసారి అధికారిక గణాంకాలుమ తెలుపుతున్నాయి.

No comments:

Post a Comment