భారతదేశం ఇటీవల
అగ్ని -5 ను విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత శక్తివంతమైన, సుదూర లక్ష్యాలను
చేదించగల, బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని -5 ప్రయోగం తో భారతదేశం అంతర్జాతీయ
స్థాయిలో మరో ఉన్నత శిఖరాన్ని ఎక్కినట్లయింది. ఇప్పటివరకు బారత సైన్యం
అంబులపొదిలో అత్యంత శక్తివంతమైన ఆయుదం ఇదే.
అందుకే దీన్ని గేమ్ చేంజర్ గా భారత రక్షణ
మంత్రికి శాస్త్ర సలహ దారుడైన వి.కె.సారస్వత్ అభివర్ణించారు. దీని అర్థం ఇప్పటి వరకూ
ఉన్న ఆయుధాలు ఒక ఎత్తైయితే ఇదొక ఎత్తు అని. ఒక టన్ను బరువు కల వార్‌హెడ్ తో (ఆయుధం)
5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అగ్ని-5 విజయంవంతంగా ఛేదించింది. అయితే,
మరిన్ని ప్రయోగాల అనంతరం దీన్ని సైన్యానికి మోహరించేందుకు అందజేస్తారు. దీన్ని
వర్గీకరించడంలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఇది భారతదేశం ప్రయోగించిన తొలి
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐ సి బి ఎం )
అని కొందరు నిపుణుల పేర్కోనగా కాదని
మరికొందరి అభిప్రాయం. ఇది కూడా మధ్యంతర రేంజి కల బాలిస్టిక్ క్షిపణియే (ఐ ఆర్ బియం
) అని మరికొందరు నిపుణుల వాదన . ఐసి బి ఎం ల లక్ష్యం 10 వేల కిలోమీర్ల వరకుంటుంది.
అగ్ని 5 లక్ష్యం 5000 కిలోమీటర్లు మాత్రమే అని వీరి వాదన . చివరకు, దాదాపు అందరు
నిపుణులు ఇది ఐ సి బి ఎం ను పోలిన క్షిపణి అని
మాత్రం అంగీకరిస్తున్నారు. మరలా వివిధ దశల ప్రయోగాలలో దీని లక్ష్య దూరాన్ని
పెంచుకోవటానికి కూడా అవకాశం ఉందని నిపుణుల వాదన. వర్గీకరణ ఎలా ఉన్నప్పటికి
భారతదేశం ఇప్పటివరకు ఇంత దూరంలో ఉన్న లక్ష్యాలను చేదించగల క్షిపణులను ప్రయోగించడం ఇదే ప్రథమం. ఐక్య రాజ్య సమితి లోని
శాశ్వత సబ్య దేశాలకు మాత్రమే ఇంతటి సామర్థ్యం కల క్షిపణులను ప్రయోగించకల సామర్థ్యం
ఇప్పటివరకు ఉంది.
Friday, April 27, 2012
Wednesday, April 18, 2012
భారతదేశంలో కనీస వసతులు- ప్రొఫెసర్.కె.నాగేశ్వర్
Tuesday, January 17, 2012
Annual Status of Education Report (ASER) 2011 : Private school enrollment is rising in most states
ASER Centre releases Annual Status of Education Report (ASER) 2011
Subscribe to:
Posts (Atom)